Monday, September 27, 2010

భావనల్లం

తెలుగిల్లు లో భావనల్లం గురిచి అడిగితే ఆనందమానంద మాయే. ఓహో ఇంకా ఇది గుర్తున్నవాళ్ళు ఉన్నారనుమాట !
వేసవి సెలవల్లో పొన్నూరు లేదా చెరుకుపల్లి వెళితే భావల్లం తప్పకుండ తినేవాళ్ళం.

పెద్ద విద్యేమి కాదు ఇది చెయ్యడం. ఇప్పటికి వేసవిలో ఇది చేస్తుంటాను. అజీర్తి, అసిడిటీ, soar throat లకు ఇది బ్రహ్మాండం గ పని చేస్తుంది .
ఒక జాడి లేదా ఒక గాజు సీసా తీసుకోండి. అల్లం పావు కిలో తీసుకొని చిన్న చిన్న (3mm) ముక్కలుగా చేసుకోండి. గుప్పెడు జీలకర్ర కూడా కలుపుకోవచ్చు. వీలైతే ఒక చెంచాడు రాతి ఉప్పు (rock salt) కలపండి. పది చెంచాలు ఉప్పు కలపండి. నాలుగు పెద్ద నిమ్మకాయల రసం కలపండి.

బాగా కలిపి జాడికి ఒక పలచటి గుడ్డ తో మూత కట్టి రెండు వారాలు మర్చి పొండి. ఇంకొక సారి బాగా కలిపి మరొక రెండు వారాలు మర్చిపోండి. బాగా ఎండ ఉన్న రోజు తీసి కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ మీద పోసి ఎండనివ్వండి. ఒక రెండు రోజులు ఎండితే చాలు ఆ తరువాత రెండు ముక్కలు నోట్లే వేసుకుంటే స్వర్గం కనిపిస్తుంది.

ఇది అజీర్తి, అసిడిటీ, దగ్గు, జలుబు మరియు soar throat కు బాగా పనిచేస్తుంది.

Wednesday, July 15, 2009

పెట్రోలు బంకు మోసం

మన అందరికీ తెలుసు పెట్రోలులో కల్తీలు. అది ఈ మద్య చట్టబద్దం చేసారనుకోండి (ఎతనోల్ కలపటం). మరి కొలతల్లో మోసాల సంగతి? ప్రతీ లీటరుకు యాబది మిల్లీ లీటర్లు దాక తగ్గించే బంకులున్నాయి తెలుసా?

నాకు తెలిసిన ఒక ఇంజనీరు (డిజిటల్ పెట్రోల్ పంపులు సర్వీసు ఇంజనీర్) ఒక సలహా చెప్పాడు. Z షేపు లో ఉన్నా పంప్ ను నమ్ముకోవటం మంచిదట. ఎందుకంటే ఈ మోడల్ పంపు లలో కొలతలు తక్కువచేయటం కష్టం అని చెప్పాడు.

నా అనుభవమైతే నిజమే అనిపిస్తున్నది. మీరు కూడా కాస్త చెప్తారా ఈ విషయం పరీక్షించి?

Saturday, July 11, 2009

చరిత్ర ముందుకి - వర్తమానం వెనక్కి

ఎప్పుడైనా సూపర్ బజారు కెళ్ళి నప్పుడు ఈ విషయం గమనించండి! సబ్బులు, బిస్కెట్లు, చిప్స్ లాంటి దగ్గర మరీ జాగ్రత్తగా చూడాలి ఈ విశేషం.

మొదటి వరుసలలో ఉండేవి పాత సరుకు. మీరు కాస్త ఓపికతో మొదటి వరుస తప్పించుకొని వెనుక వరుసలో చూడండి వాటిని తాయారు చేసిన తారీకు. తాజా సరుకు చాల సార్లు వెనుకే ఉంటుంది. అలా సర్దటం షాప్ వాడి వ్యాపార ధర్మమైతే, తాజా సరుకు కావాలనుకోవడం కోనేవాడి హక్కు.

ఇదండీ "చరిత్ర ముందుకి - వర్తమానం వెనక్కి" టపా!

Thursday, July 9, 2009

ఎక్చేంజి స్కీము - ఒక మాయ

పోయిన వారాంతం, ప్రతిసారిలాగే నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిలు చేసి షాపింగుకు తోలుకు పోయింది మా ఆవిడ.

వెళ్ళే ముందు డవిలాగులేమిటంటే (1) మన పెళ్ళప్పుడు వచ్చిన బహుమతి ఈ రెండు కుక్కర్లు (పది లీ & ఆరు లీ) (2) వీటిని చూసి చూసి విసిగి పోతున్నాను(రెండూ బాగానే పని చేస్తున్నాకాని ) ( నాకు భయం పుట్టింది - మరి నా సంగతేంటి?) (3) నేనేమికొత్త కుక్కరు కొనివ్వ మనటం లేదు. జస్ట్ ఎక్చీంజి . ఈ పాతవి రెండు ఇచ్చేసి ఒక కొత్తది తీసుకొందాము

ఇక ఈ డవిలాగులు తట్టు కోలేక పాత కుక్కర్లు కారులో వేసు కొని బయలుదేరాం. చెన్నైలో ఓవరేక్షన్లు ఎక్కువకాబట్టి షాపులో ముందు నేనే దూకాను కుక్కర్లు కార్ లోనే వదిలేసి. ఆరు లీటర్ల కుక్కరెంత? అడిగాను.

సేల్సు గర్లు ప్రతి ప్రశ్న వేసింది. కొత్తది కావాలా లేక ఎక్చీన్జా ? ( టామీల్ : పూదుసా? ఎక్చీజియా ? )
రెండు ఆప్షన్లు లో కొత్త కుక్కరే ఇవ్వాలి కదా ? నాకు అనుమానమొచ్చినా "కొత్తదే కావాలి" అన్నాను.
ఒక చిన్న షీటు చూసి చెప్పింది. ఏమ్మర్పి 1550, డిస్కౌంట్ పోయి 1150 అన్నది.
మరి కుక్కరు ఎక్చీన్జికిస్తే అని అడిగా. ఏమ్మర్పి మీద 31% డిస్కౌంట్ ఇస్తామన్నది . అంటే 1070 కి. అంటే మా బంగారంలాంటి 10 లీ కుక్కరు ఖరీదు 80 రుపాయిలన్న మాట.

ఎంత మోసమో చూసారా?

వీడికి 80 రూపయిల్కి ఇవ్వటం కన్నా మన పని మనిషికిస్తే సంతోషిస్త దని, కొత్తది కొని ఇంటికోచ్చాము ఈ సారికి.

ఎక్చేంజి స్కీము లలో చాల జాగ్రత్త గ ఉండాలి. మారుతి ట్రూ వేల్యూ దగ్గిర మరీ జాగ్రత్త గ ఉండండి. ఎక్సేంజ్ బోనస్, ఓల్డ్ కార్ వేల్యూ & కొత్త కార్ డిస్కౌంట్ అన్ని సమాసాలు వేసుకొని కొనండి.

Monday, July 6, 2009

జాగరూకతతొ ఉందాం! మోసాలనించి కాపాడుకొందాం!

మనం బయటకడుకెడితే చాలు...రోజు ఏన్నొ మోసాలు చూస్తు ఉంటాము.
చాలా వాటికి మనం కూడ బలవుతుంటాము
ఈ మోసాల పద్మవ్యూహంలోంచి ఏలా బయట పడాలో అందరికి చెప్పాలనేదే నా ప్రయత్నం.
మీ అనుభవాలను పంచుకోండి!

జాగరూకతతొ ఉందాం! మోసాలనించి కాపాడుకొందాం!