Monday, September 27, 2010

భావనల్లం

తెలుగిల్లు లో భావనల్లం గురిచి అడిగితే ఆనందమానంద మాయే. ఓహో ఇంకా ఇది గుర్తున్నవాళ్ళు ఉన్నారనుమాట !
వేసవి సెలవల్లో పొన్నూరు లేదా చెరుకుపల్లి వెళితే భావల్లం తప్పకుండ తినేవాళ్ళం.

పెద్ద విద్యేమి కాదు ఇది చెయ్యడం. ఇప్పటికి వేసవిలో ఇది చేస్తుంటాను. అజీర్తి, అసిడిటీ, soar throat లకు ఇది బ్రహ్మాండం గ పని చేస్తుంది .
ఒక జాడి లేదా ఒక గాజు సీసా తీసుకోండి. అల్లం పావు కిలో తీసుకొని చిన్న చిన్న (3mm) ముక్కలుగా చేసుకోండి. గుప్పెడు జీలకర్ర కూడా కలుపుకోవచ్చు. వీలైతే ఒక చెంచాడు రాతి ఉప్పు (rock salt) కలపండి. పది చెంచాలు ఉప్పు కలపండి. నాలుగు పెద్ద నిమ్మకాయల రసం కలపండి.

బాగా కలిపి జాడికి ఒక పలచటి గుడ్డ తో మూత కట్టి రెండు వారాలు మర్చి పొండి. ఇంకొక సారి బాగా కలిపి మరొక రెండు వారాలు మర్చిపోండి. బాగా ఎండ ఉన్న రోజు తీసి కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ మీద పోసి ఎండనివ్వండి. ఒక రెండు రోజులు ఎండితే చాలు ఆ తరువాత రెండు ముక్కలు నోట్లే వేసుకుంటే స్వర్గం కనిపిస్తుంది.

ఇది అజీర్తి, అసిడిటీ, దగ్గు, జలుబు మరియు soar throat కు బాగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment